NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు తిలక్ ను.. అభినందించిన చంద్రబాబు

1 min read

పల్లెవెలుగు వెబ్​: తెలుగుదేశం పార్టీ  జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొట్ట మొదటిగా సోషల్ మీడియా పైలట్ ప్రాజెక్ట్ ని కర్నూల్ ఐటీడీపీ విభాగం తీసుకోవడం జరిగింది అని దాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు చంద్ర బాబు గారు టీడీపీ కేంద్రకార్యాలయంలో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు తిలక్ గట్టు ని అభినందించి  సత్కరించారు. కర్నూల్ జిల్లా పైలట్ ప్రాజెక్ట్ ని విజయవంతంగా పూర్తి చేసారని రానున్న రోజుల్లో రాష్ట్రం అంతటా ఇది మొదలవాపోతుందని చంద్రబాబు తెలియచేసారు. ఇందులో భాగంగా జిల్లా నుండి సోషల్ మీడియా పరంగా చురుగ్గా ఉంటూ కష్ట పడుతున్న రవి జూటూరు (కర్నూల్ ), రఫీక్ (కర్నూల్) , సజ్జాద్ హుస్సేన్ (ఆదోని) , రవి శంకట్ (కోడుమూరు)  సభ్యులను బాబు గారి దగ్గర కలిపించి ఆయనచే బహుమతి ప్రదానం చేయించినట్లు తిలక్ గట్టు తెలియ చేసారు. రానున్న రోజుల్లో పార్టీ కొరకు కష్టపడే ప్రతి ఒక్కరిని బాబు గారు అభినందిస్తారని కావున ప్రతి ఒక్కరు సోషల్  మీడియా లో దూకుడు పెంచాలని తిలక్ గట్టు తెలియ చేసారు.

About Author