NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐటిడిపి నరసింహ కుటుంబాన్ని ఆదుకున్న నాయకులకు ధన్యవాదాలు

1 min read

– టిడిపి నాయకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : ఐటీడీపి కడప జిల్లా పార్లమెంటు ప్రథాన కార్యదర్శి నరసింహా మృతి చెందడం తో కుటుంబాన్ని ఆదుకున్న తెలుగుదేశం అధిష్ఠానం కు జీల్లా పార్టీ నాయకులను టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ధన్యవాదాలు తెలిపారు మంగళవారం కడపలో జరిగిన టీడీపీ జోన్ 5 సమావేశం సంధర్భంగా నరసింహా కుటుంబ సభ్యుల ను వేదిక పైకి ఆహ్వానించి మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ద్వారా ఆర్థిక సహాయం అందించి నరసింహా కుటుంబానికి భరోసా స్థైర్యం ఇప్పించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వికాస్ హరి ఐ టి డి పి ఉపాధ్యక్షుడు అబిద్ కు సాయినాథ్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. నరసింహ కుటుంబాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు ద్వారా తాము చేస్తున్న ఆర్థిక సహాయం అందింప చేయడం మంచి శుభ పరిణామమన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి సిద్ధపడతారన్నారు . కమలాపురం నియోజకవర్గానికి చెందిన నరసింహ ఐటిడిపి ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ ఉన్నప్పటికీ తమ నియోజకవర్గ కానప్పటికీ గోవర్ధన్ రెడ్డి రామభూపాల్ రెడ్డి, వికాస్ హరి, ఐటిడిపి సభ్యులు నరసింహ కుటుంబం పడుతున్న బాధలను ఇబ్బందులను బాధ్యతగా గుర్తించి భావించి సహాయం అందించడం తో పార్టీ కార్యకర్త లు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు.

About Author