NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మా’ అధ్యక్షుడిగా బాల‌య్య అయితే ఓకే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా ప్రముఖ క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ అయితే.. తాను ఎంతో సంతోషిస్తాన‌ని హీరో మంచు విష్ణు అన్నారు. సినీ ప‌రిశ్రమ పెద్దలంద‌రూ క‌లిసి మా అధ్యక్షుడిని ఎన్నుకుంటే తాను ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటాన‌ని ఆయ‌న ప్రక‌టించారు. వాళ్లు ఏక‌గ్రీవంగా ఎవ‌రిని ఎన్నుకున్నా త‌న‌కు ఓకే అని చెప్పారు. లేనిప‌క్షంలో పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఓ చాన‌లె కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విధంగా స్పందించారు. మా భ‌వ‌న నిర్మాణం గురించి త‌న‌కు ఓ క్లారిటీ ఉంద‌ని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు స‌మాధానం చెబుతాన‌ని చెప్పారు. రెండు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కుల‌తో త‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, భ‌వ‌న నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన భూమిని సంపాదిస్తాన‌న్న న‌మ్మకం ఉంద‌న్నారు.

About Author