జేఏసీ …ఉద్యోగులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ
1 min readఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నిరసనలు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుమేరకు అపరిస్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, పత్తికొండ తాలూకా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పత్తికొండ తాలుకా JAC ఉద్యోగులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు నల్ల బాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ, పత్తికొండ RDO రామలక్ష్మి కి వారి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల తాలూక జేఏసీ చైర్మన్ సాయిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వము ఉద్యోగులు దాచుకొన్న డబ్బులు ప్రభుత్వం నుండి రావలసిన ఒకాయిలు GPF, APGLI మరియు PRC DA ఆ రియర్స్ వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ఉద్యోగులకు రావలసిన మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్స్, గత 4 సం.ల నుండి పెండింగ్ లో ఉన్న T. A,D.A. బిల్లులు, సరెండర్ లీవులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం పే స్కేల్స్ అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ను రెగ్యులర్ చేయాలని ఆయన కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టిసీ కార్మికులు మరియు ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రసాద్ బాబు, నాగభూషణం, పెన్షనర్ల సంఘం నాయకులు టిఎండి హుస్సేన్, కృష్ణయ్య, APNGO సంఘం నాయకులు వెంకటరమణ, బడ్లయ్య, వీరన్న, వేంకటేశ్వర్లు, రెవెన్యూ అసోసియన్ సభ్యులు బాబు, వీరేష్, సందీప్, VRoలు VRA లు మరియు ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దేవయ్య, భూషయ్య నాయక్, బాషా కేశన్న. ఆర్టీసీ కార్మికులు నాగరాజు, హరున్ బాషా, బాషా వలి, రాజు తదితరులు పాల్గొన్నారు.