NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ రౌండ్ టేబుల్​ సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ రౌండ్ టేబుల్లో సమావేశం జేఏసీ ఛైర్మెన్ అరి వీసీ హెచ్ వెంగల్ రెడ్డి గారి ఆధ్యర్యంలో కర్నూలు కలెక్టరేట్ కాంప్లెక్స్ వ్యవసాయ శాఖ సెమినార్ హాల్ నందు జరపబడినది.   ఈ సమావేశంలో ఉద్యమంలో భాగంగా ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్ల ఆర్థిక పరమైన డిమాండ్ల సాధన కొరకు   20వ తేదీన జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరుకు జరిగే  ర్యాలీలో వేలమంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉద్యోగులు పాల్గొనాలని కోరుతూ వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తమ వంతు భాగంగా బారు ఎత్తున ఉద్యోగులను తరలించాలి అని జేఏసీ రౌండ్ సమావేశంలో  ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.ఈ సమావేశంకు క్రింద తెలిపిన నాయకులు హాజరు అయ్యారు.  ఏపీ జెఎసి కర్నూల్ సెక్రెటరీ జనరల్  శ్రీ జవహర్లాల్, ఏపీ జెఎసి కర్నూలు నగర చైర్మన్ శ్రీ యం సి కాశన్న, ఆర్టీసీ నేషనల్ మద్దూర్ యూనియన్  రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్, మెడికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య, APTF జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్, ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల అధ్యక్షులు మద్దిలేటి, డ్రైవర్ల సంఘం అధ్యక్షులు నాగేశ్వరావు, APPTA అధ్యక్షుడు రఫీ, ఫార్మాషీట్  అసోసియేషన్ రంగస్వామి, వివిఫ టీచర్స్ సంఘాల నాయకులు, 45 సంఘాల ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

About Author