PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ ఆశ‌యాల‌ను జ‌గ‌న్ సాధిస్తారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీకి పోటీగా వైసీపీ నేతల పేరుతో విజయవాడలో బ్యానర్లు వెలిశాయి. ఎన్టీఆర్ ఆశయాలను జగనన్న సాధిస్తారంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జయంతిపై వైసీపీ నేతల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పలు నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోజురోజుకు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతే వల్లే వైసీపీ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. చంద్రబాబును నిందిస్తూ… జగన్‌ను కీర్తిస్తూ వెలిసిన వైసీపీ నేతల ఫ్లెక్సీలు.. రాజకీయ వ్యూహంలో భాగమేనని కొందరు పేర్కొంటున్నారు.

                                       

About Author