రాయలసీమ రైతులకు జగన్ బంపర్ ఆఫర్
1 min read
పల్లెవెలుగువెబ్: రైతులకు ముఖ్యమంత్రి జగన్ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు. సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూములిచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామని… ఈ మేరకు రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుని, సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇస్తుందని చెప్పారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం మేర లీజుధరను పెంచుతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆఫర్ గురించి తెలిపారు.