జగన్.. బీసీలను సీఎం చేయగలరా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. జగన్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు మంత్రి పదవులు కాదు.. సీఎంను చేయగలరా? అని సీఎం జగన్‌ను జీవీఎల్ ప్రశ్నించారు. బీసీలకు 10 మంత్రి పదవులు ఇస్తే అభివృద్ధి చెందుతారా? అని జీవీఎల్ అన్నారు. ఎవరూ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు.