NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్.. మీ ప్రియ‌మైన ఇసుక పాల‌సీ మార్చుకోండి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ప్రియ‌మైన ఇసుక పాల‌సీ మార్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఇసుక ఒకే ధ‌ర‌కు అమలు కావడంలేద‌ని అన్నారు. న‌వ‌సూచ‌న‌లు పేరుతో సీఎంకు ర‌ఘురామ ఏడో లేఖ రాశారు. ఇసుక స‌ర‌ఫ‌రా బాధ్యత కాంట్రాక్టర్ కే అప్పగించాక ఇసుక కొర‌త తీవ్రమైంద‌న్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి అవ‌కాశాలు ప‌డిపోయాయ‌న్నారు. రెండో ఇసుక పాల‌సీ కూడ తీవ్రంగా విఫ‌ల‌మైంద‌న్నారు. మూడో ఇసుక పాల‌సీకి ఇప్పుడు ప్రక‌ట‌న‌లు కూడ ఇచ్చార‌ని తెలిపారు. జ‌గన్ హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల వ‌ద్ద ద‌ళారీల ప్రమేయం ఉంద‌న్నారు. ఇప్పుడైనా మీ ఇసుక పాల‌సీ మార్చుకోండ‌ని సూచించారు.

About Author