ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చిన జగన్
1 min read– డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి.
– టీడీపీ అధికార ప్రతినిధి.
– ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లు: కేంద్రం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: దిల్లీలో పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది. 2019తో పోలిస్తే ఏపీ అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని కేంద్రం వెల్లడించిదనిటిడిపి అధికార ప్రతినిధి డా.కాకరవాడ చిన్న వెంకట స్వామి అన్నారు.మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారన్నారు.2019లో రాష్ట్ర అప్పులు రూ. 2,64,451 కోట్లు ఉండగా 2020లో రూ. 3,07,671 కోట్లు, 2021లో రూ. 3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత రూ .3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉందని వివరించారు. ఏటా సుమారు రూ. 45వేల కోట్లు అప్పులు చేస్తోంది” అని పంకజ్ చౌదరి వెల్లడించారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసమర్థతతో ఈరోజు రాష్ట్రం అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని రాష్ట్రాన్ని అప్పులలో ప్రథమ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కి దక్కిందని రాష్ట్రం అధోగతి పాలు కావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని అతని చేతగాని పరిపాలన వల్ల, ఆర్థిక పర్యవేక్షణ, నియంత్రణ, అభివృద్ధిపై ఎలాంటి అవగాహన లేకపోవడమే కారణమని, రాష్ట్ర పరువు తీసాడని ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు క్షమించాలని అన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.