PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల ఆరోగ్య సంరక్షణే  జగన్ ప్రభుత్వ ధ్యేయం..

1 min read

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష.

ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం లాంటిది.

ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ప్రజల ఆరోగ్య సంరక్షణే  జగన్ ప్రభుత్వ  ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి అన్నారు.నందికొట్కూరు పట్టణంలోని  ప్రభుత్వ బాలిక జడ్పీ పాఠశాల లో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ప్రారంభం కార్యక్రమంలో చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి ముఖ్య అతిదులుగా పాల్గొన్నారు.నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ సురక్ష కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సంధర్భంగా  చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి లు  మాట్లాడుతూ ప్రతి ఇంటినీ, ప్రతి కుటుంబాన్ని,ప్రతి వ్యక్తిని ఆరోగ్య పరంగా సుర సందర్భంఉంచడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో  సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పేదల కోసం శ్రమిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే తపనతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం లాంటిదన్నారు. ప్రతి మనిషికి జీవితంలో ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలరన్నారు. నేడు ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా అన్ని రకాల జబ్బులకు మెరుగైన వైద్యం అందించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో దివంగత నేత వైయస్. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గుండె జబ్బులతో బాధపడుతున్న ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగులు నింపారన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి 3225  వ్యాధులకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందించడం జరుగుతుందన్నారు. పేదలు గతంలో వైద్యం పొందాలంటే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నానా ఇబ్బందులు పడే వారన్నారు. నేడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మంచి అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లచే రోగులకు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఈ మధ్యకాలంలో రాజమండ్రి దగ్గర ఒక వ్యక్తికి ఎంతో ఖర్చుతో కూడిన జబ్బు రావడంతో అతని వ్యాధి నయం చేసేందుకు ఇతర దేశాల నుంచి రూ. 16 కోట్ల  విలువైన ఇంజక్షన్ తెప్పించి ప్రాణాలు కాపాడిన దేవుడని ముఖ్యమంత్రి వర్యులను కొనియాడారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి రోగుల జబ్బు నయం చేసే విధంగా ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వ్యాధులకు ఈ క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం పొందాలన్నారు. అనంతరంజిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ  మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ముఖ్య మంత్రివర్యులకు ఇంత మంచి ఆలోచన రావడం మనందరం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైద్య సిబ్బంది ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఇంటి గడప వద్దనే ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఇక్కడ వైద్యం పొందుతున్న ప్రతి ఒక్కరి పేరు రిజిస్టర్ చేయించి వారి వ్యాధి నయం అయ్యేవరకు వైద్యులు మానిటర్ చేయడం జరుగుతుందన్నారు. పేదలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం జబ్బులకు ఖర్చు చేయడం జరుగుతుందని దీంతో ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించి ఆదుకోవాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ హెల్త్ క్యాంపు లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉండాలన్నారు.అనంతరం కలెక్టర్ జగనన్న కాలనీ సందర్శించారు.గృహ నిర్మాణాల పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కలెక్టర్ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజశేఖర్ బాబు, నందికొట్కూరు వైసీపీ  పట్టణ అధ్యక్షుడు మన్సూర్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జబ్బార్  జె.సి.రస్ కన్వీనర్ అబూబక్కర్,బాలికోన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్ లు అబ్దుల్ హమీద్ మియ్య‌‌‌, పి.చాంద్ భాష, కాటెపోగు చిన్న రాజు, అబ్దుల్ రవూఫ్, లాలు ప్రసాద్, మార్కెట్ యార్డు డైరెక్టర్ ఉస్మాన్, వైసిపి నాయకులు రజిని కుమార్ రెడ్డి, ఆర్టీసీ బాబు, కురువ శ్రీను, శాలి భాష, సచివాలయ కన్వీనర్ చింత విజయ భాస్కర్, మధుసూదన్ రెడ్డి, బోయ శేఖర్, ఆర్ట్ శ్రీను, కాటెపోగు నాగ సురేష్, వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది తదీతరులు పాల్గొన్నారు.

About Author