జగన్ పనైపోయింది
1 min read– వై నాట్ 175 ఇప్పుడు వై నాట్ పులివెందుల అయ్యింది
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత డబ్బు ప్రవాహం చేసిన ఎంతమందిని బెదిరించిన టిడిపిని గెలిపించారు
– టిడిపికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క పట్టభద్రునికి ధన్యవాదాలు
– టిడిపి గెలవడంతో రాజ్యాంగం గెలిచింది ప్రజాస్వామ్యం బతికింది
రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మోమిన్ అహమ్మద్ హుసేన్
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో గెలవడం చారిత్రాత్మకమని ఇది వైసిపి పాలనకు జగన్ అవలంబిస్తున్న దౌర్జన్యాలకు చెంపపెట్టు అని టిడిపి రాష్ట్ర నాయకులు మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు దాడులకు రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఆయన చేస్తున్న మోసాలను గ్రహించారని ముఖ్యంగా పట్టభద్రులకు జాబ్ క్యాలెండర్ ఇస్తానని మెగాడీఎస్సీ ఇస్తారని ప్రత్యేక హోదా తెస్తానని ఆశ చూపి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గద్దెనక్కగానే వారిని విస్మరించి ఇప్పుడు అబద్ధాలు చెబుతూ నాలుగు సంవత్సరాలు కాలయాపన చేశాడని అందుకు చెంపపెట్టుల పట్టపద్రులు వారి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని మోమిన్ అహ్మద్ హుస్సేన్ తెలిపారు.దొంగ ఓట్లు ఎన్ని వేసుకున్న వాలంటీర్లతో ఎంత ప్రలోభ పెట్టినా… పట్టభద్రులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎన్నుకున్నారని 9 జిల్లాల్లో 108 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ చిత్తూ చిత్తుగా ఓడడం చాలా సంతోషకరమని తెలిపారు.2024 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని కచ్చితంగా తెలుగుదేశం పార్టీ 160 స్థానాలు గెలవబోతుందని తెలిపారు.టిడిపి ఆర్టిఎస్ జూన్ 5 ఇంచార్జ్ మోమిన్ ముస్తఫా మాట్లాడుతూ వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డికి పట్టభద్రులు పులివెందులలోనే చుక్కలు చూపించారని కుప్పంలో ఫ్యాన్ బాగా వేయాలని పగటి కలలు కన్నా జగన్ రెడ్డికి పులివెందుల పూల అంగట్లలోనే చిత్తుచిత్తుగా టిడిపి ఓడించిందని తెలిపారు. ఎంత విర్రవీగినా ఒకానొక రోజు వైసిపిపార్టీ కాలగర్భంలో కలవడం తధ్యమని వైసిపి పార్టీ ఎంత ఎత్తుకు ఎదిగినట్టు నటించినా ఒకానొక రోజు ఓడిపోవడం తద్యమని అది కూడా 2024 ఎన్నికల్లో మనం చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మోమిన్ ఇస్మాయిల్ జబివుల్లా, రేడియం నూర్ అహ్మద్,తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు మనోహర్, ఆరో వార్డు టిడిపి ఇన్చార్జ్ ఇలియాస్, గఫూర్, ఉస్మాన్ భాష, మాసూం వలి తదితరులు పాల్గొన్నారు.