ఒక్క అవకాశం అంటూ …జగన్ రైతుల మెడకు మీటర్ల ఉరి
1 min read– పాణ్యం టిడిపి ఇన్చార్జి గౌరు చరితారెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఒక్క అవకాశం అంటూ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు గురువారం నాడు పెసరవాయి గ్రామంలో టిడిపి పాణ్యం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి బాబు, ష్యురిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామంలోని సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ నవరత్నాలంటూ ప్రజలను మోసం చేసి రైతులను మోటార్లకు మీటర్లు బిగించి ఉరితాడు తగిలించాడని మండలంలో నాయకులు ప్రజలను దోచుకోవడం ప్రభుత్వ భూములను కబ్జా చేయడం అభివృద్ధి మండలంలో ఎక్కడ కనబడడం లేదన్నారు టిడిపి హాయంలో చేసిన అభివృద్ధిని తమ అభివృద్ధి అంటూ గొప్పలు చెబుతున్నారని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గని శకునాల సోలార్ పార్క్.. జయరాజ్ ఇస్పాల్ స్టీల్ పరిశ్రమ ఓర్వకల్ ఎయిర్ పోర్టు నిర్మించారని. స్థానికంగా వైసిపి ఎమ్మెల్యే మట్టిని కూడా వదలడం లేదని ఆరోపించారు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను పీడిస్తున్నారని ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని. ఆరోపించారు. ఎన్నికలలో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తే గడివేముల మండలానికి. వెలగమాను డ్యాం . అలగనూరు రిజర్వాయర్. గడివేముల గ్రామానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు మేలు కలిగేలా టిడిపి మినీ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని మహిళా శక్తి పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు . మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం. డిగ్రీ చదివిన ప్రతి ఒక్క యువతకు ఉద్యోగం వచ్చేంతవరకు 3000 రూపాయలు జీవన మృతి ఇస్తామన్నారు. తప్పుడు కేసులు బనాయించి ప్రజలను నాయకులను వేధించారని బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామన్నారు ఈసారి ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. బాబు వస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని అందరూ ఈసారి టిడిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని భారీ మెజార్టీతో రాష్ట్రంలో టిడిపి అధికారంలో వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేలా ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు విజన్ ఉన్న నాయకుడిని సంపద సృష్టించే నాయకుడు సీఎం అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భారత దేశ చరిత్రలో రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయేలా తుగ్లక్ పాలన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు పాలించారని ఈసారి టిడిపికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.. గౌరు చరిత రెడ్డి సమక్షంలో స్థానిక నాయకుడు తూం బాలేశ్వర్ రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సత్యం రెడ్డి . పంట రామచంద్రారెడ్డి. ఓడ్డు లక్ష్మీదేవి. ఒడ్డు ప్రశాంతి. అనసూయమ్మ. ఎస్ ఏ ఫరూక్. సుభద్రమ్మ. ఎస్ ఏ రఫిక్. బి సీతారాం రడ్డి. సుదర్శన్ రెడ్డి. పంట దిలీప్ కుమార్ రెడ్డి. పంట రామ్ మద్దిలేటి రెడ్డి..ఎస్ ఏ ఖాలిద్ . వంగాల మురళీధర్ రెడ్డి . హర్ష రెడ్డి. ఈశ్వర్ రెడ్డి. గడిగరేవుల శ్రీనివాసులు. గిరిబాబు. యుగంధర్ రెడ్డి.