PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ నా హీరో !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడం ద్వారా ఏపీ ప్రభుత్వం తీవ్ర చర్చకు ఆజ్యం పోసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టడం, తదనంతరం అధికార భాషా సంఘం చైర్మన్ పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయడం తెలిసిందే. అయితే, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇటీవల జరిగిన పరిణామాలపై తన గళం వినిపించారు. సీఎం జగన్ ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఆయన తన దృష్టిలో హీరో అని కొనియాడారు. గతంలో జగన్ ను సోనియా కేంద్రమంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయిన వ్యక్తి జగన్ అని తెలిపారు.

                              

About Author