NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మా నమ్మకం నువ్వే జగన్

1 min read

– మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం గురించి వివరిస్తున్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు
– పాల్గొన్న నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ గారు,నగర కార్పొరేటర్లు, సి.హెచ్ మద్దయ్యా గారు,తెలుగు అనిల్ కుమార్,
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం రాయల్ ఫంక్షన్ హాల్ లో కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు నగర కార్పొరేటర్లు,వార్డ్ నాయకులు ఇన్చార్జిలు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు గృహ సారధులతో సమావేశమయ్యి రేపటినుండి జరగబోయే మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు పిలుపు ఇవ్వడం జరిగింది.రాష్ట్రంలో సంక్షేమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మేలును రేపటి నుండి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. కర్నూలు నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జగనన్న మా నమ్మకం నువ్వే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డ్ నాయకులను, గృహసారధులను, కన్వీనర్లను, మా నమ్మకం నువ్వే జగన్ కిట్లను, పాంప్లెట్స్, పెన్స్, స్టిక్కర్స్,… కిట్స్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు కార్పొరేటర్లు, కన్వీనర్లు, గృహసారదులు, హాజరయ్యా.రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని అమలు చేసి, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు.

About Author