జగనన్నే మా భవిష్యత్తు – మా నమ్మకం నువ్వే జగన్
1 min read– వైసిపి పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు
– 15వ వార్డులో అట్టహాసంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం
– 2 లక్షల కోట్లు సంక్షేమానికే ఖర్చు చేసిన ఘనత సిఎం జగనన్న గారికి సాధ్యం
– వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలు సంతృప్తి
– మేనిఫెస్టోలో ఇచ్చిన 98% హామీలు అమలు
పల్లెవెలుగు వెబ్ కర్నూల్ : 15వ వార్డులో ఉదయం కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ అబ్జర్వర్ కర్ర హర్షవర్ధన్ రెడ్డి, నగర మేయర్ బి.వై రామయ్యా గారు, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు.15వ వార్డ్ 37వ సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరును అడిగి ప్రజా మద్దతు బుక్ లో నమోదు చేశారు. అనంతరం వారి ఫోన్ ద్వారా 8296082960 నెంబర్ కి మిస్డ్ కాల్ చేయించారు. అలాగే ఇంటి యజమాని అనుమతితో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్ ను అతికించారు. ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గ అబ్జర్వర్ కర్ర హర్షవర్ధన్ రెడ్డి గారు, నగర మేయర్ బి.వై రామయ్యా , కర్నూలు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పాలనను వై.యస్.ఆర్ కుటుంబం చేస్తుందని కొనియాడారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇంటింటికీ తిరిగి మెగా సర్వే చేస్తున్నామని, తద్వారా ప్రజలకు ఇంకా మంచి చేసే పనులు ఉన్నాయేమో తెలుసుకుంటామన్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నామన్నారు. వైయస్ జగన్ అన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకే 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అతియేశక్తి కాదన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్ సేవా దళ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కేదార్ నాథ్, మాజీ మేయర్ బంగి అనంతయ్య, వెంకటేశ్వరమ్మ, నాగమణి, సుగుణ, దినకర్, శంకర్, మధు, వాని, బీసీ సెల్ పార్ల సూర్యుడు, 14వ వార్డు ఇన్చార్జ్ రెడ్డి మంజులత, శివకుమార్, కిరణ్, 16వ వార్డు ఇన్చార్జి పవన్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.