అప్పులు ఎలా తీర్చాలో జగన్ కి తెలుసు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన సమయంలో అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని, ఏపీ కంటే ఎక్కువ అప్పు చేసిన రాష్ట్రాలు ఉన్నాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో సీఎం జగన్ కు తెలుసని, ఆయన 30 ఏళ్లు అధికారంలో ఉంటారని వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన పై రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పర్యాటక రంగం నుంచి ఏటా రూ. 200 కోట్ల ఆదాయం వచ్చేలా అభివృద్ధి, విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.