మహిళలను మహా రాణులుగా చేసిన జగన్
1 min readవచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి వై. బాలనాగిరెడ్డి ని నాల్గవ సారీ ఎమ్మెల్యే గా గెలిపించాలి.
టీటీడీ పాలకమండలి సభ్యులు వై. సీతారామి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మహిళలను మహారాణులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామి రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా, చేయూత, స్త్రీ నిధి పథకం నిధుల విడుదల కార్యక్రమానికి వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, వైకాపా ఇన్ చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య తో కలిసి సీతారామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డ్వాక్రా మహిళలు స్థానిక జీపీఎస్ రెసిడెన్సీ వద్ద నుంచి ఆయన కాన్వాయ్ పై పూల వర్షం కురిపిస్తు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఉరేగింపు నిర్వహించారు. సభ స్థలి వద్దకు రాగానే ఎంపీడీఓ మునెప్ప, ఏపీఎం జయశ్రీ ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు. రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వైఎస్సార్ ఆసరా పథకం కింద 726 డ్వాక్రా గ్రూపులకు 3 కోట్ల 35 లక్షలు, 4వ విడత వైఎస్సార్ చేయూత 3606 మంది కి 6 కోట్ల 76 లక్షల 12 వేల 500 రూపాయలు, స్త్రీ నిధి పథకం కింద 500 మంది లబ్ధిదారులకు 3 కోట్ల 2 లక్షల రూపాయలు మంజూరు కావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. మనకు మంచి చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరలా కొనసాగలంటే అందరూ త్వరలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా మా సోదరుడు వై. బాలనాగిరెడ్డి ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్ని పార్టీలు ఏకమైన రెండో సారి ముఖ్యమంత్రి గా వైఎస్. జగన్మోహన్ రెడ్డే కావడం ఖాయమని, బాలనాగిరెడ్డి నాలుగో సారి ఎమ్మెల్యే కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మెగా చెక్కులను పంపిణీ చేశారు. పక్కనే డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను సందర్శించి అభినందనలు తెలిపారు.అనంతరం రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న సాంగ్ కు డ్వాక్రా మహిళలు డ్యాన్స్ వేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ వర్మ సార్, సీఐ ఏరిషావలి, ఎస్ఐ గోపినాథ్, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర , చెట్నేహళ్లి సర్పంచ్ అంజిని, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, రచ్చమరి రోగప్ప, రవి రెడ్డి, నారాయణ వీరితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.