PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు…

1 min read

బడేటి చంటి…

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : టిడిపి జాతీయ అధ్యక్షులు ,మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబును అక్రమంగా వైసిపి ప్రభుత్వంకేసులు బనాయించి అరెస్టు చేయడంపై ప్రజాగ్రహానికిగురికాక తప్పదని టిడిపి ఏలూరు  నియోజకవర్గం ఇన్చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కునిరసనగా బడేటి చంటి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులుస్థానిక వసంత మహల్ సెంటర్లలో నిరాహార దీక్షలు చేపట్టారు. పోలీసులు దీక్షకు అనుమతి లేదని రిలే దీక్షను భగ్నం చేశారు. అనంతరం బడేటి చంటి తన కార్యకర్తలతో కలిసి చేపల తూము సెంటర్లో  దీక్షలు చేపట్టారు.ఈ సందర్భంగా బడేటి చంటి  మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు పతనం అవుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన ఉద్యమం ద్వారా జగన్ రాక్షస పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.రాజకీయ జీవితంలో మచ్చలేనిమనిషిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన చంద్రబాబుపైసైకో జగన్ రెడ్డి అక్రమంగా కేసులు బనాయించారని, వచ్చేఎన్నికల్లో ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని విమర్శించారు. రాష్ట్రమంతా ఫ్యాక్షనిజాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా జగన్పథకం ప్రకారం పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు జగన్పరిపాలనలో అవినీతిని, చంద్రబాబు హయాంలో అభివృద్ధినిగమనించాలని కోరారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై నియంతలా  పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా మళ్లీప్రజాక్షేత్రంలోకి వస్తారని, టిడిపి కార్యకర్తల ఆందోళనతో జగన్రెడ్డికి వణుకు పుట్టాలన్నారు. వైసీపీని ఓడించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని, జగన్ లాంటి నియంతకు రాబోయే ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.చంద్రబాబు నాయకత్వంవర్ధిల్లాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పార్టీకార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ, డిప్యూటీ మాజీ మేయర్ చోడే వెంకటరత్నం, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, మారం అను, మల్లెపురాము, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author