జగన్ అవుట్ డేటెడ్.. ఏపీ మంత్రి !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు టంగ్ స్లిప్ అయ్యారు. గన్నవరం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సందర్భలో నోరు జారి తమ అధినేత జగన్‌పై విమర్శలు చేశారు. జగన్మోహనరెడ్డి అవుట్‌డేటెడ్ అయిపోయాడు…అని రెండు సార్లు సంబోధించారు. వాస్తవానికి ఆయన ఈ వ్యాఖ్యలు చంద్రబాబుపై చేసే క్రమంలో పొరపాటున జగన్ పై చేశారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం ఎస్సీ, బీసీ, మైనారిటీ మంత్రుల బృందం ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తోంది. ఈ సందర్భంగా గన్నవరంలో సభ నిర్వహించారు.