PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మళ్లీ క్రైస్తవులను మోసం చేసేందుకు తెర లేపిన జగన్‌ రెడ్డి

1 min read

టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామి దాసు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో క్రైస్తవులను   మరోసారి మోసం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెరలేపారని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు , వైస్ ప్రెసిడెంట్ ఎ.వై.ఎన్.బాబురాజ్  పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ క్రిస్టియస్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామి దాసు  వైస్ ప్రెసిడెంట్ బాబురాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 75వేల మంది క్రైస్తవులు, పాస్టర్లు ఉంటే 10శాంత మందికి మాత్రమే గౌరవ వేతనాలు ఇస్తున్నారని, మిగిలిన వారికి వేతనాలు ఇవ్వకుండా నిలువునా మోసం చేశారన్నారు. ప్రతి నియోజకరవ్గంలో చర్చిలు, బరియల్‌ గ్రౌండ్‌లు, క్రైస్తవుల కాలనీలు ఎన్ని నియోజకవర్గాలలో కట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో చర్చి నిర్మాణాలకు రూ.5లక్షలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లు దండుకున్నారన్నారు. గత ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌ రాష్ట్రంలోని పాస్టర్లకు ఓ చోటుకు చేర్చి జగన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన మ్యానిపెస్టో పాస్టర్లకు చూపుతూ.. ఎన్నికల్లో జగన్‌ను గెలిపించుకుంటే అన్ని విధాలుగా క్రైస్తవులు జీవితాలు బాగుపడుతాయని హామీ ఇచ్చారు. అయితే.. ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను జగన్‌రెడ్డి పూర్తిగా విస్మ రించారన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. క్రైస్తవుల ఓట్లతో ఎన్నికల్లో గెలుపొంది.. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులను ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా అందజేయకుండా నిలువునా మోసం చేశాడన్నారు. మ్యానిపెస్టో బైబిల్‌ లాంటిదని, ఖురాన్‌ లాంటిదని, భగవత్‌గీత లాంటిదని ఎన్నికల మందు కల్లిబొల్లి మాటలతో రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాడన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి మళ్లీ క్రైస్తవులను మోసం చేసేందుకు తెరలేపారన్నారు. రాష్రంలో విమలారెడ్డి అనే క్రైస్తవ మహిళ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ క్రైస్తవులకు మోసపూరిత హామీలను ఇస్తున్నారని, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా.. క్రైస్తవుల ఆస్తులను దోచుకుంటుంటే మీరంతా అప్పుడు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 277 చర్చిలను కట్టించారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క చర్చి అయినా కట్టించారా.. అని ప్రశ్నించారు.క్రిస్టియన్ నాయకులు స్యామ్ పాల్గొన్నారు.

About Author