జగన్ కూడ తగ్గించాలి : పవన్ కళ్యాణ్
1 min read
పల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం హర్షణీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడం పేదలకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్సు అధికంగా ఉందని, జగన్ ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని పవన్ కోరారు. రోడ్లను బాగుచేయలేని ఏపీ ప్రభుత్వం.. కనీసం పెట్రోల్, డీజిల్ ధరలనన్నా తగ్గించాలని సూచించారు.