PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ సీఎం గా జగన్ రావాలి

1 min read

హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  జగన్ పాలనలో అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ది అందుతోందని ఇచ్చిన హామీలను దాదాపు నూటికి నూరుశాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు.మంగళవారం నందికొట్కూరు మున్సిపాలిటీలోని 13, 27  వార్డు హాజీ నగర్ 14 వ సచివాలయం పరిధిలో  కౌన్సిలర్లు  సమీరా భాను, శాంత కుమారి ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కు సీఎం జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో  ముఖ్య అతిధిగా  మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆర్షపోగు ప్రశాంతి, స్థానిక కౌన్సిలర్  సమీరా భాను , పాలమర్రి శాంత కుమారి,  వైసీపీ పట్టణ నాయకులుతో కలసి  పాల్గొన్నారు. హాజీ నగర్ సచివాలయ పరిధిలో వివిధ పథకాల ద్వారా జరిగిన అభివృద్ధిని తెలిపే బోర్డ్ ను మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ప్రారంభించి  ఏఏ పథకం ద్వారా ఎంతమేలు జరిగిందో ప్రజలకు  వివరించారు.నాన్ .డిబిటి ద్వారా  రూ17,02,11,721, డి బి టి ద్వారా రూ  24,82,73 ,783  మొత్తం కలిపి రూ.41,84, 85,504   లబ్ది అందిందని, పథకాల  వారీగా ఈ వివరాలు ను వివరించారు .అనంతరం జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ  పట్టణ పేదల కోసం కొణిదెల రహదారిలో దాదాపు రెండు వేల ఇళ్లతో జగనన్న కాలనీ నిర్మాణం జరుగుతోందన్నారు. జగన్ పాలనలో ప్రతి నెలా ఒకటవ తేదీన తెల్లారక ముందే అవ్వా తాతలకు  పెన్షన్ అందుతోందన్నారు.45 ఏళ్ళు దాటిన అక్క చెల్లెమ్మలకు ఏటా రూ 18,750 అందుతోందన్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా రుణాలు మాపీ చేస్తామని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసగించారన్నారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ఆర్ పాలనలో ఇచ్చిన హామీలుతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారన్నారు. మైనారిటీ లకు 4 శాతం రిజర్వేషన్లు, ఆరోగ్యశ్రీ తదితర పథకాలును తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు చెప్పింది చేయలేదని, ఇప్పుడు అధికారం లోకి వస్తే చేస్తామని చెప్పుచుంటే ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదన్నారు.15 ఏళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు హయాంలో శాశ్విత అభివృద్ధి పథకం ఒక్కటైనా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. జగన్ నాలుగన్నరేళ్ల పాలనలో 3 సార్లు డ్వాక్రా  రుణమాఫీ, 4 సార్లు అమ్మఒడి, 3 సార్లు చేయూత, పాఠశాలల అభివృద్ధి , కరోన సమయంలో తమ వంతు సహకారం అందించామని, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సహకారంతో పట్టణ ప్రజలకు నిత్యావసర సరుకులను అందచేసామన్నారు. కోవిడ్ ఆసుపత్రులకు,కోవిడ్ కేర్ సెంటర్ల లో రోగులకు అందుతున్న వైద్య సేవలును ప్రత్యక్షంగా పరిశీలించి తోడుగా నిలిచామన్నారు.ఆ సమయంలో  టి డి పి నాయకులు  ఇళ్లలో ఉన్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎస్ సి,ఎస్ టి,బిసి, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేసిందన్నారు గ్రామ,వార్డు సచివాలయ,వాలంటరీ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రజల చెంతకే పాలన అందించారన్నారు.విద్య,వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు .బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కృషితో  పట్టణంలో దాదాపు రూ. 25 కోట్లతో  ముమ్మరంగా అభివృద్ధి పనులు జరుగుచున్నాయన్నారు.ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలు అండగా నిలిచి మళ్ళీ ముఖ్యమంత్రి గెలిపించాలని కోరారు.మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహత్ జబ్బార్ , పట్టణ అధ్యక్షులు షేక్ మన్సూర్ , పట్టణ జేసీఎస్ కన్వీనర్ అబ్భుబక్కర్,  వైఎస్ఆర్సిపి జిల్లా కమిటీ సభ్యులు  ఉస్మాన్ బేగ్, వైఎస్ఆర్సీపీ పట్టణ ఉపాధ్యక్షులు ఉపేంద్ర రెడ్డి, చింతా విజ్జి, కౌన్సిలర్లు లాలు, అబ్దుల్ రావూఫ్, హమీద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు బద్దుల శ్రీకాంత్, డి.రమేష్, పి.రమేష్, శాలి బాషా, వీ.ఆర్.శీను, కురువ శీను, ఎల్లయ్య, ఆచారి, ఓల్డ్ బీఎస్ ఆర్  టీమ్ లడ్డు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి  అభిమానులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author