PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇక జగన్ హాలిడే తీసుకోవాలి !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం వైఎస్ .జగన్ మోహన్ రెడ్డి పాలనా తీరుపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు సంధించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లను సంధించారు. మొన్న పవర్ హాలీడే అన్న జగన్ సర్కారు…నిన్న క్రాప్ హాలీ డే అన్నదని… ఇఫ్పుడేమో ఆక్వా హాలీడే అంటోందని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇక జగన్ రెడ్డి హాలీడే తీసుకోవడం మాత్రమే మిగిలి ఉందని ఆయన అన్నారు. ఆక్వా కంగాన్ని ఉద్ధరిస్తానని నమ్మించి ఆక్వా రైతులను జగన్ మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో ఆక్వా రంగం సంక్షోభంలో పడిందని లోకేశ్ అన్నారు.

About Author