ఆయన నుంచి జగన్ 9 వేల కోట్లు తీసుకున్నారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. లిక్కర్ మాఫియాతో జగన్ కు సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పట్టుబడ్డ శరత్ చంద్రారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువని చెప్పారు. శరత్ రెడ్డి నుంచి జగన్ కు ముడుపులు అందాయని… రూ. 9 వేల కోట్లను జగన్ తీసుకున్నారని అన్నారు. ఏపీ సీఐడీకి ఇది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.