PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీల అభ్యున్నతిని మరిచిన జగన్​..

1 min read

బీసీల సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత ఆయనదే

  • జయహో బీసీ సభలో మాండ్ర శివానందరెడ్డి

నందికొట్కూరు, పల్లెవెలుగు: బీసీల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని  టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి ,నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు. శనివారం నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో  తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు  నందికొట్కూరు మండల క్లస్టర్ జయహో బిసి కార్యక్రమంలో  నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జి  మాండ్ర శివానందరెడ్డి , నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి జయసూర్య,లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాండ్ర శివానందరెడ్డి, జయసూర్య  మరియు బి.సి నాయకులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం బి.సీలకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా, బిసిలకు అందించే సంక్షేమ పథకాలు, ఆదరణ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో దాదాపు 74 మంది బిసిలు హత్యగావించబడితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తి చేయలేని దుర్మార్గపు పాలన ఈ వైసిపి ప్రభుత్వానిదని విమర్శించారు. చెత్తపై కూడా పన్ను విధించిన ఘనత ఈ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బిసిలకు అనేకరకాల సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి తోడ్పడిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో బిసిలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. అలాగే రాబోయే ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్  హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

రైతుల పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ:

రాష్ట్రంలో రైతులు కష్టపడి సంపాదించిన పొలం పాసుపుస్తకాలపై జగన్ మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోడమెంటని, దీనిని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని నందికొట్కూరు మండలం  రైతుల ఆధ్వర్యంలో పాసుపుస్తకాలకు సంబంధించిన పత్రాలను టీడీపీ నాయకులు  తగలపెట్టటారు. కార్యక్రమంలో క్లస్టర్ రఘురామిరెడ్డి, కన్వీనర్ ఓబుల్ రెడ్డి, జెనసేన రవికుమార్ ,కురువ శివయ్య, అల్లూరు సర్పంచ్ కురువ నాగలక్ష్మయ్య ,కురువ వెంకటేశ్వర్లు, వడ్డేమాను సర్పంచ్ బోయ రామచంద్రుడు, సాలె మహేశ్వర, సిద్దయ్య, బాల మద్దయ్య, నాగటూర్ మల్లికార్జున రెడ్డి, బండి రంగస్వామి, వల్లపురెడ్డి మోహన్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author