PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుపరిపాలనను అందిస్తున్న జగన్ ను మళ్లీ సీఎం చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ సిపి నందికొట్కూరు మండల కన్వీనర్ రవియాదవ్అన్నారు. గురువారం నందికొట్కూరు మండలం లోని దామగట్ల గ్రామంలో  సర్పంచి మాధవరం సుశీలమ్మ ఆధ్వర్యంలో  వై ఏపీ నీడ్స్ సీఎం జగన్ కార్యక్రమ నిర్వహించారు.ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగతిపథంలో నిలపడాన్ని రవియాదవ్ ప్రజలకు వివరించారు. పందిళ్ళ పల్లె  గ్రామానికి చేసిన మంచిని గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్లు  వెల్లడించి సంక్షేమ పథకాల బోర్డును స్థానిక నాయకులతో కలసి  ఆవిష్కరించారు.జెండాను ఆవిష్కరించారు . ఎన్నికల మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసి మాట నిలబెట్టుకోగా 2014లో చంద్రబాబు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా నిలువునా మోసగించిన తీరును వివరించారు.ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో నాడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు మేనిఫెస్టోను మాయం చేయడాన్ని గుర్తు చేశారు.  చంద్రబాబు–పవన్‌లు ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తున్నారని, వారికి తగినరీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన కొనసాగాలంటే సీఎం జగన్‌ను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి, జడ్పీటిసి కలిమున్నీసా, వైసీపీ పార్టీ జేసీఎస్ కన్వీనర్ ఓంకార్ రెడ్డి , జిల్లా కార్యవర్గ  సభ్యులు పబ్బతి రవి కుమార్  ,మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహాత్ జబ్బార్ ,బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు సతీష్ రెడ్డి ,నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మి కాంతరెడ్డి,దామగట్ల వైసీపీ నాయకులు బైరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాధవరం రత్నం, సంజన్న  ,  బ్రాహ్మణకొట్కూరు వైసీపీ నాయకులు,శివ రెడ్డి, అశోక్ రెడ్డి, బైరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుబ్బన,నందికొట్కూరు మండల  వైసీపీ ఎంపీటీసీలు,సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు, మండల కమిటీ సభ్యులు, గృహ సారథులు, వాలంటీర్స్,గ్రామ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు , బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  అభిమానులు పాల్గొన్నారు.

About Author