27 మందికి క్లాస్ పీకిన జగన్
1 min read
పల్లెవెలుగువెబ్: అధికార పార్టీ వైసీపీ చేపడుతున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత హోదాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు పాలుపంచుకున్న ఈ సమావేశంలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల దాకా గడపగడపకు కొనసాగించాల్సిందేనని ఆయన సూచించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్నికల్లో 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారని నాని తెలిపారు. గడపగడపకు కార్యక్రమంలో పనితీరు బాగా లేని వారి సంఖ్య 27గా తేలిందని చెప్పిన జగన్… వారి పేర్లను మాత్రం వెల్లడించలేదన్నారు. పేర్లు వెల్లడిస్తే… ఒకరిని తక్కువ చేసినట్లు అవుతుందన్న కారణంగా జగన్ పనితీరు బాగా లేని నేతల పేర్లను వెల్లడించలేదన్నారు.