NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవ్వ తాతలను వేధించినందుకు ..జగన్కు పాపాలు వెంటాడతాయి

1 min read

 పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో వయసు మళ్లిన వృద్ధులంతా తన అవ్వతాతలే అంటూ.. ఆర్భాటంగా అబద్దాలు మాట్లాడే జగన్ కు పాపాలు వెంటాడతాయని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి.హనుమంతరావు చౌదరి అన్నారు. ఆరోగ్యం సహకరించక ఏ పని చేతకాని పరిస్థితుల్లో ఉన్న అవ్వ తాతలకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ప్రతిపక్షాల మీద బురద చల్లుతూ తప్పించుకు తిరుగుతున్న జగన్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఇన్ని రోజులు తాడేపల్లి నుంచి బయటికి రాకుండా..  వచ్చినా పరదాలు కట్టుకొని తిరుగుతూ.. నిజాలు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడుతూ దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి..  ఇప్పుడు బయటకు వస్తే అన్ని నిజాలు బయటపడుతున్నాయని జీర్ణించుకోలేక.. తన పాపాలన్నీ  ప్రతిపక్షాల మీదికి తోసేస్తున్న జగన్ ఇప్పటికైనా నిజం తెలుసుకోవాలన్నారు.  ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తావని.. మా నాయకుడు చంద్రబాబునాయుడు ప్రజల్లో నుంచే ప్రశ్నిస్తే.. నిజాలను వక్రీకరించి చెబుతూ.. బరితెగించి అబద్ధాలు మాట్లాడం జగన్ కే చెల్లు అని విమర్శించారు.  చట్టపరంగా పరిపాలించమని కోర్టు చెబితే ,కోర్టు చంద్రబాబు నాయుడు ది అంటున్నావ్.. ఆంధ్రదేశంలో ఏది జరిగినా .. చంద్రబాబునాయుడుకి అంటిచాలని చూస్తున్నావు..  అలా చేయడం మంచిది కాదన్నారు.  నిన్ను నమ్మి అవ్వదాతలు ఓటేశారు.. ఆడపడుచులు ఓటేశారు..  ఒక్కసారి అవకాశం అని చెప్పి..  రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుని.. నాశనం చేశావని..  రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావని.. నీకు కూల గొట్టడం తప్ప.. కట్టడం రాదు.. పరిపాలించడం అంతకంటే.. రాదు.. రాబోయే ఎన్నికలలో చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు ప్రజలకి మంచి జరుగుతుందన్నారు.  ఇప్పుడు ఉన్నపథకాల కంటే చంద్రబాబునాయుడు  ప్రకటించిన ఆరు పథకాలతో ఇంకా మంచి జరుగుతాయన్నారు.  ఏది జరిగినా చంద్రబాబు నాయుడు  మీదకు తో సే  ఈముఖ్యమంత్రికి రాబోయే ఎన్నికలలో కర్నూలు జిల్లాలో ఏడు అసెంబ్లీలు.. పార్లమెంటు స్థానాల్లో ఘన విజయం చేకూర్చాలని హనుమంతరావు చౌదరి కోరారు.

About Author