NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘జగనన్నే మా భవిష్యత్​’…అబద్దాల ప్రచారం..

1 min read

కేంద్రం నిధులతో… నవరత్నాలు అమలు

ప్రధాని పేరు చెప్పకుండా… జగన్​ స్టిక్కర్లు..

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి

పల్లెవెలుగు వెబ్, కర్నూలు​:నవరత్నాలతో రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని వైసీపీ కార్యకర్తలకు..నాయకులకు సీఎం జగన్​మోహన్​ రెడ్డి చెప్పి పంపడం దారుణమన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి.  శనివారం కోడుమూరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. పార్థసారధి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాలకు 60 నుంచి 70 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని, కానీ తామే ఇచ్చినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పేదొడి  సొంతిల్లు( జగనన్న హౌస్​) కోసం కేంద్ర ప్రభుత్వం వందశాతం నిధులు ఇవ్వడం నిజం కాదా అని డా. పార్థసారధి ఘాటుగా ప్రశ్నించారు. రైతు భరోసాలో సగం డబ్బులు కేంద్రమే ఇస్తుంటే… అబద్దపు బటన్​ నొక్కారని, యూరియాలో 90శాతం సబ్సిడీ ఇస్తేంటే…  రైతులకు సరిగా పంపిణీ  విఫలమయ్యారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పేదోడికి ఉచిత వైద్య సేవలు అందిస్తామంటున్నారని, కానీ అందులో ఆయుష్మాన్​ భారత్​ కింద 60 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందన్నారు. జల యజ్ఞంలో భాగంగా రాయలసీమలో కానీ ఏపీలో మరెక్కడైనా ప్రాజెక్టులు కట్టారా అని ప్రశ్నించారు. ఫీజురీయంబర్స్​మెంట్​ నిర్వీర్యం చేశారు.. ఎన్నికల ముందు మద్యం నిషేధిస్తామని మాటిచ్చారు… అధికారం వచ్చిన తరువాత నియంత్రణ అంటూ కల్లిబొల్లి మాటలు పలుకున్నారని, పైగా మద్యం విక్రయం వల్ల వచ్చిన ఆదాయంతో నవరత్నాల పథకాలకు ఉపయోగించుకుంటున్నామని నిసిగ్గుగా చెప్పుకురావడం … ఒక్క వైసీపీ ప్రభుత్వానికే సాధ్యమన్నారు.

డబ్బు ప్రజలది… పని పార్టీకా..?

రాష్ట్ర ప్రజల సొమ్ముతో వాలంటీర్లకు… సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని, కానీ వారితో పార్టీ పనులు చేయించుకోవడం దారుణం కాదా అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేపడుతున్న ‘జగనన్నే మా భవిష్యత్​’కు వాలంటీర్లను, సచివాలయాలను వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఓబీసీ మోర్చ జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు, కోడుమూరు నియోజక వర్గ ఇన్​చార్జ్​ మీసాల ప్రేమ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

About Author