జగనన్నే మా భవిష్యత్తు కిట్లు ను అందజేసిన హోం మంత్రి
1 min read– కన్వీనర్లు, గృహ సారదులు చిత్త శుద్ధితో పనిచేయాలి..
– రాష్ట్ర హోం మంత్రి వనిత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గృహ సారధులు, సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్లకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కిట్లను అందజేసిన మంత్రి తానేటి వనిత గృహ సారధులు, సచివాలయాల కన్వీనర్లు చిత్త శుద్ధితో పనిచేయాలని హోంమంత్రి, ప్రకృతి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. కొవ్వూరులోని లిటరరీ క్లబ్ లో శనివారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పై కొవ్వూరు టౌన్ పరిధిలోని సచివాలయాల కన్వీనర్లు, గృహ సారధులు, వాలంటీర్ల సమావేశంలో పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కిట్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ. శుక్రవారం నాడు ప్రారంభించిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ వరకు ఉదృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఇంటికి సభ్యులకు ఎవరికి ఎంత ఇచ్చారో వివరించాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయాలన్నారు. ఈ పుస్తకంలో మొత్తం 5 ప్రశ్నలుంటాయని వివరించారు. ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా?. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా. గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పింఛన్, అమ్మఒడి, ఆసరా చేయూత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్లకి వేయడం లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా?. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా. వంటి ప్రశ్నలకు అవును లేదా కాదు అనే సమాధానం తీసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమం పూర్తి ఉచితమని, ఏది తిరిగి కట్టవలసిన అవసరం లేదన్నారు. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏదైనా సమస్య చెబితే. పెన్షన్ రావట్లేదని, ఇళ్లు ఇవ్వలేదని అవి మంత్రి దృష్టికి తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14న కొవ్వూరు నియోజకవర్గంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి వస్తుండటం మనందరి అదృష్టమన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మంత్రి తానేటి వనిత కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.