PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు..

1 min read

– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

– పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక వైద్య సేవలoదిస్తోంది..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :    పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక వైద్య సేవలు ద్వారా వైద్యాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి పిఓఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు మరియు పూనం మాలకొండయ్య వారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం చివరిలో ప్రారంభిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష (జే ఏ ఎస్) వైద్య శిబిరాల ప్రతి జిల్లాలోని పట్టణాల్లోనూ మండలాల్లోనూ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వాలంటీర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పీహెచ్సీ డాక్టర్లు , స్పెషలిస్టులు, మండల తాసిల్దార్లు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వైద్య శిబిరాలు నిర్వహించాలని వీటికి సంబంధించిన యాప్ ను వాలంటరీ డౌన్లోడ్ చేసుకుని కార్యక్రమానికి ముందే ఇంటింటికి వెళ్లి వైద్య సేవలపై సర్వే చేయించాలని, అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వారికి సంబంధించిన రోగాలను గుర్తించి మెడికల్ క్యాంపు నిర్వహించే ప్రాంతానికి తీసుకువచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని మండలాల్లోని తాసిల్దారులు ఎంపీడీవోలు మెడికల్ అధికారులు, నిర్వహణకు సంబంధించిన షామియానాలు, ప్రదేశాన్ని సంబంధిత  ఏర్పాట్లను  పర్యవేక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పబ్లిసిటీని క్యాంపు వివరాలను షెడ్యూల్ స్థానిక మండల అధికారులు తయారుచేసి సిద్దం చేయాలని తెలిపారు. అలాగే ఐసిడిఎస్, అంగన్వాడి పిల్లలకు, బాలింతరాలకు గర్భిణీలకు, పాఠశాల కాలేజీ విద్యార్థులకు, ఈ శిబిరాల యొక్క ప్రాముఖ్యం తెలియచేయాలని చెప్పారు. మెడికల్ క్యాంపుకు సంబంధించిన మందులను కిట్స్. కు104 వాహనాన్ని వినియోగించుకోని క్యాంపులు నిర్వర్తించాలన్నారు. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయడం జరుగుతుందని, జీవోలో పొందుపరిచిన మార్గదర్శకాలను అనుసరించి అధికారులు జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులను విజయవంతం చేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్ కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి, మాట్లాడుతూ జగనన్న సురక్ష మెడికల్ క్యాంపు నిర్వహణ జిల్లాలో విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు అందరూ కృషి చేయాలని దీనికి సంబంధించిన షెడ్యూల్ ను సంబంధించిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారిని ఎస్ . శర్మిష్ట, జిల్లా ఆస్పత్రి సమన్వయ అధికారి డాక్టర్ కె పాల్ సతీష్ కుమార్, డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ జోషి, జెడ్పి సీఈవో రవికుమార్, డిపివో తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్,డీఈవో జి.శ్యాంసుందర్, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ బాపిరాజు  తదితరులు పాల్గొన్నారు.

About Author