పొదుపు భవనంలో జగనన్న చేదోడు కార్యక్రమం
1 min read– ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు అవుకు మండల పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాలు రెడ్డి గారు, మండల అభివృద్ధి అధికారి శివరామయ్య గారు.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో జగనన్న చేదోడు కార్యక్రమం సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన స్థానిక శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి చిత్రపటానికి బనగానపల్లి మండల యాగంటి పల్లె గ్రామ మహిళల లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళా లబ్ధిదారులు పూలమాలలతో శాలువాలతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, యాగంటి పల్లె గ్రామ సర్పంచ్ బండి వరలక్ష్మి ,ఎంపీటీసీ మారం లక్ష్మీదేవి, వైయస్సార్ పార్టీ గ్రామ నాయకుడు బండి బ్రహ్మానందరెడ్డి, శివప్రసాద్ రెడ్డి ,కళాధర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, యామసుధాకర్ రెడ్డి, యామ పుల్లారెడ్డి, పట్టణ కార్యనిర్వహణ అధికారి ఖలీల్ భాషా, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకున్న మహానేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు. పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను ఇప్పటికే 99% మేరా అమలుపరిచి ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్ ,బైబిల్ సమానంగా భావించి అమలు చేసిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుందని చెప్పారు. బనగానపల్లె మండలం లో జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా 95 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి 10,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని మహా సంకల్పంతోనే జగనన్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని అమలుపరచి రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితిని నిలకడగా వుంచిన ఆర్థికవేత్త మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జన్మభూమిలో కమిటీల పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను కేవలం టిడిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే అందించడం జరిగిందని అయితే నేడు మన జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని చెప్పారు. మళ్లీ మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకు అందుతాయని చెప్పారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైయస్సార్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని తనను ప్రజల ఆశీర్వాదంతో గెలిపించిమళ్లీతననుశాసనసభ్యునిగా, ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.