PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న కాలనీ లబ్ధిదారుల గోడు అధికారులకు పట్టదా.? 

1 min read

– మా ఇంటి స్థలాలు ఎక్కడో చూపించండంటూ 

– అధికారులను వేడుకుంటున్నా  లబ్ధిదారులు.

– గోశాల పేరుతో ఆక్రమణకు గురైన లబ్ధిదారుల స్థలాలు..?

– మూడేళ్ళుగా సమస్యను పరిష్కరించని అధికారులు..? 

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  అర్హత గల ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రంలో కాలనీలు కాదు  ఏకంగా ఊళ్లకు ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఒకటి అరా కాలనీ ఇళ్లు మంజూరు చేసి  సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సగంలోనే విడిచి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని సౌకర్యాలతో కాలనీలను నిర్మించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీ కొంత మంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా  ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో 154మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేసింది. కొందరు ఇంటి నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని  బేస్ మెంట్ లెవల్ లో ఉండగా దాదాపు 26 మంది లబ్ధిదారులకు నేటి వరకు అధికారులు ఇంటి స్థలాలు చూపలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.దాదాపు మూడేళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కోరుతూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. జగనన్న కాలనీ లబ్ధిదారులకు కేటాయించిన స్థలం కబ్జాకు గురైందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

లబ్ధిదారులకు కేటాయించిన స్థలం కబ్జా..గోశాల పేరుతో ఒక వ్యక్తి  ఏకంగా జగనన్న కాలనీ లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలనే కబ్జా చేశాడని ఆరోపిస్తున్నారు.  స్థలం తనది అని  ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా అడ్డు పడుతుండడం తో  ఇంటి నిర్మాణాలు చేపట్టలేక పోతున్నామంటున్నారు లబ్ధిదారులు . దాదాపు 26  మంది జగనన్న కాలనీ లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టలేక పోతున్నారు. ఇంటి నిర్మాణానికి ఇంటి పునాదులు తీసుకోవాలని వెళ్లిన  లబ్ధిదారులను భయబ్రాంతులకు గురి చేస్తూ అడ్డుకుంటున్నా సంఘటన నందికొట్కూరు మండలం బిజినవేముల నెలకొంది .గ్రామానికి చెందిన ఆవుల శ్రీనివాసులు గోశాల పేరుతో ప్రభుత్వం జగనన్న కాలనీకి లబ్ధిదారులకు కేటాయించిన 1.50 ఎకరా స్థలాన్ని కబ్జా చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు . తమకు కేటాయించిన ఇంటి స్థలాలు  కబ్జా కు గురికావడంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు.  తమకు ఇంటి స్థలాలు చూపించాలని అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేశారు .ఆవుల శ్రీనివాసులు నుంచి తమ స్థలాలను ఇప్పించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఇప్పటికీ  సమస్య పరిష్కారం కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు . బిజినవేముల గ్రామ  సర్వే నెంబర్ 410 లో ప్రభుత్వం జగనన్న కాలనీలో 154 మందికి ఇంటి  స్థలం కేటాయించి లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేశారు. దాదాపు 80 మంది ఇంటి నిర్మాణాలు చేపట్టారు. కొందరివి పునాదుల దశలో ఉండగా 26 మందికి ఇంటి స్థలం ఎక్కడో కూడా అధికారులు చూపలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో ఆవుల శ్రీను అను వ్యక్తి  అక్రమంగా అక్రమించుకున్నారని పశువుల కోసం గడ్డివాము వేసుకున్నారన్నారని తమకు  కేటాయించిన ఇంటి స్థలాలు నాకు చెందినవి అంటూ ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నాడని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.సమస్య పరిష్కారం కోసం గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. త్వరలో ఆరు నెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. సమస్య పరిష్కారం కాకుంటే తమ సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేశారు.అధికారులు సమస్యను పరిష్కరించాలి..ఇంటి స్థలం ఇవ్వడమే కాదు  ఇంటి నిర్మాణమంతా ప్రభుత్వ బాధ్యతే, జగనన్న కాలనీలు నిర్మిస్తాం  సకల సౌకర్యాలు కల్పిస్తాం  లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయడమే తరువాయి  అని నాయకులు చెపితే. ఇదంతా నిజమే అని పేదలు ఆశపెట్టుకున్నామని , జగనన్న కాలనీలలో నాయకులు అధికారులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం కాగానే ఎంతో సంతోషం పడ్డామన్నారు . బేస్‌ లెవల్‌లోనే నిర్మాణాలు ఆగిపోవడం, ఇంటి నిర్మాణంలో అడుగడుగునా సమస్యలే. జగనన్న కాలనీల గండం గట్టెక్కేది ఎలా? అని మదనపడుతున్నారు బాధితులు.అధికారులే సమస్య పరిష్కారం చేయాలని కోరారు.లబ్ధిదారులకు న్యాయం జరగాలి..అధికారులు స్పందించి జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న  అతనిపైన చర్యలు తీసుకోవాలని, జగనన్న లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామ సర్పంచి రవి యాదవ్ అధికారులను కోరారు.

About Author