జగనన్న కాలనీల ఇల్లు త్వరితగతిన పూర్తి చేయాలి : కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను లను తరగతి గతని చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కోటేశ్వరరావు పత్తికొండ మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయంలో ఆకస్మికంగా సందర్శించారు. పత్తికొండ ప్రాంతంలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ స్థానిక ఆరవ సచివాలయాన్ని సందర్శించి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించారు. సచివాలయ ఉద్యోగులు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు బాధ్యతతో తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ బోధనా అంశాలపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి జవాబులు రాబట్టగలిగారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డిఓ మోహన్దాస్ తాసిల్దార్ విష్ణు ప్రసాద్ ఎంఈఓ మస్తాన్వలి హౌసింగ్ అధికారులు ఇతర శాఖల అధికారులు ఉన్నారు.