అల్వాలలో జగనన్న కాలనీ ఆకస్మిక తనిఖీ :జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని అల్వాల గ్రామంలో జగనన్న కాలనీ నీ జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీనవర్గాల కు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసి పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామంలోని జగనన్న కాలనీలో ఇండ్ల నిర్మాణాలను మొదలు పెట్టిన ఇళ్ళు తక్కువగా ఉండటంతో వాటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాలనీలో మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, హౌసింగ్ ఏఈ లక్ష్మన్న, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.