NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులకు జగనన్న ఆర్ధిక సహాయం 

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప : ఆంధ్రప్రదేశ్ నుండి పవిత్ర హజ్ యాత్ర చేయు మైనార్టీ లకుసంబంధించి ప్రత్యేకించిగన్నవరం,విజయవాడ ఎంబార్కెషన్ పాయింట్ నుండి బయలుదేరు 1813 మంది యాత్రికులకు,  విమాన టికెట్టు పై, ప్రతి యాత్రికునిపై రూ.80,000/-  అదనపు భారం పడుతుందని ఆందోళన చెందుచుండగా,  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ , మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రుల తో సంప్రదింపులు జరిపి, హైదరాబాద్ మరియు బెంగళూరు ఎంబార్కెషన్ పాయింట్ ల టికెట్ ధరలతో సమానంగా విజయవాడ ఎంబార్కెషన్ పాయింట్ కు టికెట్ ధర నిర్ణయించాలని కోరినట్లు డిప్యూటీ సీఎం అంజద్ భాష తెలిపారు, అయితే సాంకేతిక కారణాల వలన ఆయా మంత్రిత్వ శాఖలు తమ నిస్సహాయతను ప్రకటించిన విషయం  రాష్ట్ర ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందిస్తూ, ఆ అదనపు భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఎట్టి పరిస్థితులలో కూడా యాత్రికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు, తానిచ్చిన మాటకు కట్టుబడి,  ప్రభుత్వ ఉత్తర్వులు జి. ఓ. ఆర్. టి. నెం.114, మైనార్టీస్ వెల్ఫేర్ (ఓ. పి. &బడ్జెట్) డిపార్ట్మెంట్, తేది:15.05.2023న రూ.14.51 కోట్లు ఆర్థిక సహాయం విడుదల చేసి, మరొక్క సారి తాను ముస్లిం మైనార్టీల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు, ఈ మొత్తాన్ని, గన్నవరం విజయవాడ ఎంబార్కెషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు బయలుదేరు 1813 మంది యాత్రికులకు సంబంధించి,  సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకు వారు చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా సెంట్రల్ హజ్ కమిటీకి ఈ రోజే చెల్లించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, దేశంలో ఎంబార్కెషన్ పాయింట్ ల వారీగా, పది రాష్ట్రాలలో టికెట్ ధరల విషయంలో ఆయా రాష్ట్రాల హజ్ యాత్రికులపై ఆర్థిక భారం పడుతున్నదని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నిర్ణయించిన ధరల మేరకు, యత్రికులపై పడిన అదనపు ఆర్థిక భారాన్ని, దేశంలో, కేవలం, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తున్నదన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుచున్నానని ఆయన తెలిపారు.

About Author