జగనన్న గోరుముద్ద.. విద్యార్థులకు పోషకాలు గల రాగి జావా
1 min read– చిన్నారులకు మరింత ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వ చర్యలు- ప్రజా ప్రతినిధులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఇప్పటికే సమూల మార్పులు చేసి బలవర్తకమైన మెరుగైన రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం ప్రభుత్వం అందించడం జరుగుతుందని, అంతేకాకుండా విద్యార్థుల ఆరోగ్య, ఎదుగుదల కొరకు మరో అడుగు ముందుకేసి వారికి రోజువారి మెనూలో రాగి జావా ఏర్పాటు చేయడం జరిగిందని జడ్పిటిసి ముదిరెడ్డి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి లు తెలిపారు, మంగళవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జగనన్న గోరు ముద్ద కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు రాగి జావా కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పాలనలో విద్య కు, వైద్యానికి, వ్యవసాయానికి అధిక పరాధారణీయత ఇవ్వడం జరిగిందన్నారు, అందుకే ఆయన విద్యకు ఎనలేనటువంటి కృషి చేయడం జరిగిందని వారు తెలిపారు, నేడు నాడు -నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ కార్పొరేట్ పాఠశాలకు తలదన్నే విధంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు, అదేవిధంగా విద్యార్థులకు ప్రతిరోజు మెనూ మార్చి ఆరోగ్యకరమైనటు వంటి పౌష్టిక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు, ఇందులో భాగంగా రాగి చావు అని కూడా ఏర్పాటు చేసి ఐరన్’ కాల్షియం వంటి పోషకాలు అందించి విద్యార్థులలో రక్తహీనత, పోషక లోపాన్ని నివారించడం జరుగుతుందని వారు తెలియజేశారు, వారానికి మూడు రోజులు బెల్లంతో కూడిన రాగిజావను విద్యార్థులకు అందించడం జరుగుతుందని, అదే విధంగా ఇక మిగిలిన మూడు రోజులు గోరుముద్దలు చిక్కిళ్లను అందిస్తారని వారు తెలిపారు, గత ప్రభుత్వ హయాంలో నాసిరకంగా ఉడికి ,ఉడకని రుచి పచీ లేని కూరలతో మధ్యాహ్న భోజన పథకం ఉండేదని, నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, బడికి వెళుతున్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలని జగనన్న గోరుముద్ద పథకం పేరుతో రుచికరంగా రోజుకో మెనూ తీసుకువచ్చి చిన్నారులకు మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు పాటుపడడం జరిగిందన్నారు, జగనన్న గోరుముద్ద లో భాగంగా 15 వెరైటీలతో ఐదు రోజుల గుడ్డు, మూడు రోజులు చిక్కి, మంగళవారం నుండి మూడు రోజులు రాగి జావా తో మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విమల, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లోమడ లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు రమణారెడ్డి ,గంగాధర్, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.