PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న గోరుముద్ద నాణ్యంగా ఉండాలి

1 min read

– మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద నాణ్యంగా ఉండాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు రూరల్ మండలం మిలిటరీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జగనన్న గోరుముద్ద అమలును కలెక్టర్ తనిఖీ చేశారు.. అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, స్వీట్ చిక్కి ని విద్యార్థినులతో పాటు కలిసి భోంచేశారు.ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం తయారు చేసిన తీరును, మంచినీటి సదుపాయాలు , తరగతి గదులను తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉంటుంది.. రుచిగానే ఉంటోందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. బాగా ఉంటుందని విద్యార్థినులు సమాధానం చెప్పారు . అనంతరం కలెక్టర్ సైన్స్ ల్యాబ్ ను , డిజిటల్ లైబ్రరీని పరిశీలించారు , ఆ తరువాత క్లాసు రూములు పరిశీలించారు..ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు.. సుమతీ శతకం లోని వినదగు నెవ్వరు చెప్పిన అనే పద్యాన్ని విద్యార్థులతో చెప్పించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.. భోజనం ద్వారా విద్యార్థులకు మంచి పోషకాహారం లభించాలని సూచించారు.. ప్రతిరోజు ఒక ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేస్తూ మధ్యాహ్న భోజనం బాగుండే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు… సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, l పిల్లలతో ప్రతిరోజు పది నిమిషాలు మాట్లాడి, వారి బాగోగులు, సమస్యలు తెలుసుకుని, వారికి సరైన సలహాలు ఇచ్చి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఉపాధ్యాయులను కోరారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో వెంట డీఈవో రంగా రెడ్డి,సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వేణు గోపాల్, కర్నూలు రూరల్ తహసిల్దార్ రమేష్ బాబు, హెడ్మాస్టర్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author