కవ్వగుంట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష
1 min read– వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..
– ఎమ్మెల్యే అబ్బాయా చౌదరి
– సేవలందించిన ఎంపీడీవో రాజ్ మనోజ్, తాసిల్దార్ నాగరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పెదవేగి మండలం కవ్వ గుంట గ్రామం లో శనివారం జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్షా కార్య క్రమానికి మంచి స్పందన లభించించి.జగనన్న ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను మించి జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం కవ్వ గుంట గ్రామం లో నూటికి నూరు శాతం పైగా సక్సస్ సాధించి ఇప్పటి వరకు పెదవేగి మండలం లో జరిగిన క్యాంపు ల రికార్డ్ లను బడ్డలుగొట్టింది. ఉదయం 9 గంటల ప్రాంతానికే ఓ పి 250 కి చేరి వైద్య.శిబిరమంతా రోగులతో కిట కిట లాడింది.వైద్య సిబ్బందితో బాటు ఈ కార్య క్రమ కో ఆర్డినేటర్లు పెదవేగి తహసీల్దార్ నల్లమెల్లి నాగరాజు.ఎం పి.డి ఓ. గంజి రాజ్ మనోజ్ లు శిబిరానికి వచ్చిన వృద్ధులకు స్వయంగా సేవలందించారు. కవ్వగుంట గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో గుండె. ఊపిరితిత్తులు జబ్బులు మహిళలకు సంబంధించిన. గైనిక్ సమస్యలు ఉదర కోశ వ్యాధులు చెవి, ముక్కు గొంతు, ఎముకలు. నరాలు.మెదడు.పక్షవాతం. వంటి జబ్బులకు.మధుమేహం.ఎలర్జీ.వంటి వ్యాధులతో బాటు కంటి చూపు తో బాటు సాధారణ వ్యాధులకు కూడా పరీక్షలు చేసి ఉచితంగా ఆపరేషన్లు మందులు పంపిణీ చేస్తారని ఎం పి డి ఓ రాజ్ మనిజ్ తెలిపారు.