లక్ష్మీపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం..
1 min read– పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు..
– కార్పొరేట్ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం..
– ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామం లోప్రజల ఆరోగ్య పరిరక్షణ జగనన్న ప్రభుత్వ లక్ష్యమని దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి అన్నారు. పెదవేగి మండలం దిబ్బగూడెం లక్ష్మీపురం గ్రామం లో గురువారం జరిగిన జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ఎం ఎల్ ఏ ప్రారంభించారు.ఈ సందర్భం గా ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు ఉచితంగాఅందించి పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని అందించాలని ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం తోజగనన్న సురక్షా పథక ఉద్దేశమని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలు ఈ పధకం ద్వారా అందించే వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లక్ష్మీపురం లో జరిగిన జగనన్న సురక్షా కార్యక్రమానికి లక్ష్మీ పురం.ఎం ఆర్ సి కాలనీ. వీరంపాలెం గ్రామాలనుండి ప్రజలు పెద్ద ఎత్తునతరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెదవేగి ఎం పి పి తాతా రమ్య కుమార్. దెందులూరు ఏ ఎం సి మాజీ చైర్మన్ మేకా లక్ష్మణరావు. లక్ష్మీపురం ఎం పి టి సి. పెదవేగి సొసైటీ చైర్ పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు. మండల స్పెషల్ ఆపీసర్ మరియు తహసీల్దార్.ఎన్ నాగరాజు. ఎం.పి.డి.ఓ. జి రాజ్ మనోజ్.వైద్యాధికారులు .ఐసి డి ఎస్ సిబ్బంది. సచివాలయ.రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.