NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెసరవాయి గ్రామంలో  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం..

1 min read

వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీడీవో మల్లీశ్వరప్ప

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పెసర వాయి గ్రామం లో శనివారం  జరిగిన జగనన్న ఆరోగ్య సురక్షా కార్య క్రమానికి మంచి స్పందన లభించించి.జగనన్న ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను మించి జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం పెసర వాయి గ్రామం లో నూటికి నూరు శాతం పైగా సక్సస్ సాధించి ఇప్పటి వరకు  మండలం లో జరిగిన క్యాంపు ల రికార్డ్ లను బడ్డలుగొట్టింది. ఉదయం 9 గంటల ప్రాంతానికే ఓ పి 502 కి చేరి వైద్య.శిబిరమంతా రోగులతో కిట కిట లాడింది.వైద్య సిబ్బందితో బాటు ఈ కార్య క్రమ కో ఆర్డినేటర్లు ఎంపీడీవో మల్లీశ్వరప్ప. ప్రభుత్వ వైద్యురాలు ముల్ల జబీన్  శిబిరానికి వచ్చిన వృద్ధులకు స్వయంగా సేవలందించారు. గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో గుండె. ఊపిరితిత్తులు జబ్బులు మహిళలకు సంబంధించిన. గైనిక్ సమస్యలు ఉదర కోశ వ్యాధులు చెవి, ముక్కు గొంతు, ఎముకలు. నరాలు.మెదడు.పక్షవాతం. వంటి జబ్బులకు.మధుమేహం.ఎలర్జీ.వంటి వ్యాధులతో బాటు కంటి చూపు తో బాటు సాధారణ వ్యాధులకు కూడా పరీక్షలు చేసి ఉచితంగా ఆపరేషన్లు మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఎల్లారెడ్డి శ్రీకాంత్ రెడ్డి శిరుప శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

 

About Author