జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం..
1 min read– పేదల ప్రజల సంజీవని జగనన్న ఆరోగ్య సురక్ష..
– మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఉన్న అభిమానమే జగనన్న ఆరోగ్య సురక్ష పథకానికి పునాది అయిందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక తంగెళ్ళమూడి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన మెగా మెడికల్ క్యాంపుకు మేయర్ నూర్జహాన్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2 టౌన్ ప్రాంతంలో గత 15 రోజులుగా 10 డివిజన్ల లోని ఆరు సచివాలయాల పరిధిలో 134 క్లస్టర్లలో అర్బన్ హెల్త్ సెంటర్ల డాక్టర్లు,గ్రామ వార్డు సచివాలయాల ఏ ఎన్ ఎం లు ఆశా వర్కర్లు 7743 ఇళ్లకు తిరిగి21వేయి 482 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారన్నారు.వివిధ రకాల కారణాలతో అనారోగ్యంగా ఉన్న 468 మందికి టోకెన్లు ఇచ్చి ఈరోజు జరుగుతున్న క్యాంపుకు తీసుకు రావడం జరిగిందన్నారు. వారందరికీ ఈ రోజున అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఒక ఫైల్ క్రియేట్ చేసి సీనియర్ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన అన్ని రోజులు ఉచితంగా మందులు ఇస్తారన్నారు. పేద ప్రజల సంజీవిని జగనన్న ఆరోగ్య సురక్ష అనే కొనియాడారు.టిబి,క్యాన్సర్,గుండెకు సంబంధించిన వ్యాధులకుఅవసరం అయితే ఆరోగ్యశ్రీ ద్వారా చత్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. గతంలోషుగర్,బిపి,టిబి,క్యాన్సర్,గుండె వ్యాధులు ఉన్నవారికి ఇప్పటినుండి వారి జీవితకాలం మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని మేయర్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు అందించలేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మన గడప వద్దకు తీసుకువచ్చి అందిస్తున్నారన్నారు.మనమందరం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు కోరారు.మెడికల్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ స్టాల్,రిజిస్ట్రేషన్ స్టాల్స్, ఫార్మసీ గది, వైద్య అధికారుల గదులు మేయర్ నూర్జహాన్ పెదబాబు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ,డిప్యూటీ కమిషనర్, డాక్టర్ ఎన్.రాధ, కార్పొరేటర్లు నున్న స్వాతి శ్రీదేవి కిషోర్,దేవరకొండ శ్రీనివాసరావు, అర్జీ సత్యవతి నాగేశ్వరరావు,ఈదుపల్లి కళ్యాణి పవన్, ఇలియాస్ పాషా, జుజ్జవరపు విజయనిర్మల,కో-ఆప్షన్ సభ్యులుమున్నుల జాన్ గురునాథ్. గ్రామ వార్డు సచివాలయల సెక్రటరీలు ఏఎన్ఎంలు అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్లు సిబ్బంది స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.