తండ్రికి తగ్గ తనయుడు జగనన్న… ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: జగనన్న పాలనలో రాష్ట్రంలోని ప్రతి గడపలో అర్హతల ప్రకారం సంక్షేమ ఫలాలు లభించాయని పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు గురువారం నాడు మంచాలకట్ట గ్రామ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన చేయగా నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేఘనాథ్ రెడ్డి.. అనిల్ కుమార్ రెడ్డి . మండల వైసీపీ అధ్యక్షుడు ఎల్లంపల్లి శివరామిరెడ్డి. గని ఉప సర్పంచ్ శివానందరెడ్డి. ఎల్లారెడ్డి. రఘు మాధవరెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. రాజారెడ్డి. వైస్ ఎంపీపీ. కాలు నాయక్ ఆర్ బి కే పుల్లయ్య. సర్పంచ్ మూసాని వెంకటరమణ. అన్ని శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.