జగనన్న శాశ్వత భూ హక్కు… భూ రక్ష పథకం వరం లాంటిది
1 min read– ప్రజలు రీ సర్వే కి సంబంధించి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు.
–ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్.
పల్లెవెలుగు వెబ్ ఆదోని: జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం వరం లాంటిదని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. సోమవారము నందవరం మండలం పెద్దకొత్తిలి గ్రామంలో జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంలో బాగంగా గ్రౌండ్ ట్రూత్కింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ,ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ… గత 100 సంవత్సరాల నుండి ఎపుడు జరగని రీ సర్వే పనులు మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం ద్వారా రైతులందరికీ భూ హక్కు మరియు భూ రక్ష కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిందని ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సబ్ కలెక్టర్ అన్నారు. ఈ పథకం ద్వారా భూ సమస్యలు స్వస్తి పలికి ప్రతి రైతు యొక్క భూమిని సర్వే చేసి హద్దురాలు ఏర్పాటు చేసి భూములను డిజిటలైజేషన్ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు దీర్ఘకాలంగా ఉంటున్న భూ సమస్యలను ఈ పథకం ద్వారా స్వస్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిత్యానంద రాజు, సర్వేయర్ , రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.