జగనన్న సురక్ష…. లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేత..
1 min readపల్లెవెలుగు, ఏలూరు జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు, ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆదేశాల మేరకు స్థానిక 35వ డివిజన్ నందు శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు 35, 36, 37, 38, 40, 41, 42 డివిజన్ లకు సంబంధించి 16, 17, 25, 27, 28 సచివాలయాలు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గుడిదేశీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జగనన్న సురక్ష కార్యక్రమంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 13 రకాల ధ్రువపత్రాలను జగనన్న సురక్షా లో నమోదు చేసుకున్న వారికి ఒక్క రూపాయి సర్వీస్ చార్జీ లేకుండా అందించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 37 డివిజన్ వైఎస్సార్ పార్టీ ఇంఛార్జి పర్పోలేటి శ్రీనివాసరావు, 38 డివిజన్ కార్పొరేటర్ తోట హేమ మాధురి, 40 డివిజన్ కార్పొరేటర్ తుమరాడ స్రవంతి , 41 డివిజన్ కార్పొరేటర్ ఈదుపల్లి కళ్యాణి దేవి హాజరైనారు. ఈ కార్యక్రమానికి ఏలూరు నగర మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ , డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధా, సచివాలయ నోడల్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారధులు, కన్వీనర్లు హాజరైనారు.