పేదల సంక్షేమానికి భరోసానే జగనన్న సురక్ష ఉద్దేశ్యం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేదల సంక్షేమానికి మరింత భరోసాను ఇస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నదే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నందికొట్కూరు మున్సిపాలిటీ మారుతి నగర్ 9వ సచివాలయం పరిధిలో మున్సిపల్ కమీషనర్ పి.కిషోర్ , మున్సిపల్మేనేజర్ మంజునాథగౌడ్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , కౌన్సిలర్ లాలు ప్రసాద్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 11 రకాల ధృవీకరణ పత్రాలు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం అన్నారు. గతంలో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే వారని ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసిన వెంటనే సర్టిఫికెట్ లు అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు వివిధ రకాల ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మధుసూదన్ రెడ్డి, ముచ్చుమర్రి భాష, బొల్లెద్దుల ఏసన్న, ఆర్.ఐ శ్యామలాదేవి, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ లు, ప్రజలు పాల్గొన్నారు.