PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న విద్యా దీవెన..తల్లుల ఖాతాలో రూ. 25.37 కోట్లు జమ..

1 min read

– 31,859 మంది విద్యార్ధులకు లబ్ది..

– వి జయ ప్రకాష్ … జెడి సోషల్ వెల్ఫేర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 31,859 మంది అర్హులైన విద్యార్థులకు సంబంధించి 28,928 మంది తల్లుల ఖాతాలకు రూ. 25.37 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని సోషల్ వెల్పేర్ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ చెప్పారు.చిత్తూరు జిల్లా నగరి నుంచి  సోమవారం రాష్ట్రస్ధాయి జగనన్న విద్యా దీవెన కింద 2023 ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికి సంబంధించి ఫీజు రియింబర్స్ మెంట్ ను అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏలురు కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో సోషల్ వెల్పేర్ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్,  జిల్లా బిసి సంక్షేమ శాకాధికారి ఆర్. వి. నాగరాణి,  విద్యార్థినీలు, వారి తల్లులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు రూ. 25.37 కోట్ల మెగా చెక్ ను సోషల్ వెల్పేర్ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ అందజేశారు.  ఈ సందర్బంగా సోషల్ వెల్పేర్ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ  జిల్లాలో జగనన్న విద్యాదీవెన కింద 31,859 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరిందన్నారు.  అందులో ఎస్సీ సంక్షేమం కింద 8254 మంది విద్యార్థులకు చెందిన 7500 మంది తల్లుల ఖాతాలల్లో రూ.7.08 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.  ఎస్టీ సంక్షేమం కింద 1476 మంది విద్యార్థులకు చెందిన 1371 మంది తల్లుల ఖాతాలల్లో రూ.79 లక్షలు, బిసి సంక్షేమం కింద 14197 మంది విద్యార్థులకు చెందిన 12868 మంది తల్లుల ఖాతాలల్లో రూ.10.86  కోట్లను జమ చేయడం జరిగిందన్నారు.  ఈబిసి కింద 831 మంది విద్యార్థులకు చెందిన 740 మంది తల్లి ఖాతాలల్లో రూ. 66 లక్షలు,  ముస్లిం మైనారిటీ కింద 4069 మంది విద్యార్థులకు చెందిన 3724 మంది తల్లి ఖాతాలల్లో రూ. 3.21 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. కాపు సంక్షేమం కింద 4069 మంది విద్యార్థులకు చెందిన 3724 మంది తల్లి ఖాతాలల్లో రూ. 3.21 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీ కింద 416 మంది విద్యార్థులకు చెందిన 370 మంది తల్లి ఖాతాలల్లో రూ. 31 లక్షలు  జమ చేయడం జరిగిందన్నారు.

About Author