గొందిపర్లలో… ‘జగనన్న విద్యా కానుక’
1 min readపల్లెవెలుగు:కర్నూలు మండలం గొందిపర్ల గ్రామం లోని వసంత నగర్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ల యందు గ్రామ సర్పంచ్ శ్రీ బి శ్రీనివాసులు గారిచే నేటి ఉదయం జగనన్న విద్యా కానుక ను విద్యార్ధుల కు పంపిణీ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ గారు పాలన లో విద్యా రంగం నకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం మరియు స్కూల్ బ్యాగ్ మొదలైనవి ఉచితంగా అందిస్తున్నారు. నాడు నేడు తో విద్యార్ధులకు కావలసిన సౌకర్యాలు అన్ని సమకూరుస్తున్నారు. విద్యార్ధుల సంఖ్య కు సరిపోయినంత మంది టీచర్ పోస్టులు ఇచ్చారు. విద్యా దీవెన తో ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇంకా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటిని అన్నిటినీ విద్యార్ధులు తమ యొక్క ప్రతిభ ను మెరుగు పరచుకోవాలి అనే జగనన్న ఆశయం ను మీరు నెరవేర్చాలి అన్నారు.ఈ కార్యక్రమం లో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంపత్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఆప్టా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు, రాష్ట్ర ఉపాధ్యాయ నాయకుడు డాక్టర్ సుబ్బారాయుడు ఉపాధ్యాయ సిబ్బంది మస్తాన్ వలీ, పుల్లన్న, లత, పద్మావతి, వెంకట రమణ గుప్త,దత్తాత్రేయ, ప్రసాదు, శ్రీనాథ్ మొదలైన వారు పాల్గొన్నారు.