PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆవిష్కరించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో నవరత్నాల సంక్షేమ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తో పాటు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిఎల్డివో జనార్ధన్ తదితరులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రభుత్వ రూపొందించిన 2023-24 ఆర్థిక సంవత్సర సంక్షేమ క్యాలెండర్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులకు పంపిణీ చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్ ద్వారా ముందుగానే ప్రకటించి తదనుగుణంగా ప్రభుత్వం లబ్ది చేకూరుస్తుందన్నారు.

About Author